Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ తెలుసు కుందాం.

 



Cinema: మరో కొత్త వారం వచ్చేసింది. ఈ వారం సినీ ప్రియులను అలరించేందుకు బోలెడంత ఎంటర్ టైన్మెంట్ సిద్ధంగా ఉంది. థియేటర్, ఓటీటీలో అదిరిపోయే సినిమాలు సందడి చేయనున్నాయి.

ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

థియేటర్ సినిమాలు :

హరి హర వీర మల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్స్ లో విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని జ్యోతికృష తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో పవన్ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు అమాంతం ఆకట్టుకున్నాయి.



మహా అవతార్ నర్సింహ

హోంబోలే ఫిలిమ్స్ రూపొందించిన 'మహా అవతార్ నర్సింహ' జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ మహావిష్ణువు పది అవతారాల ఆధారంగా రూపొందిన ఈ సీరీస్ మొత్తం 7 భాగాలుగా రానుంది. అందులో మొదటి అవతారం 'మహా అవతార్ నర్సింహ'. ఫాంటసీ, మైథలాజికల్ అంశాలను కలగలిపి దీనిని తెరకెక్కించారు. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


సర్ మేడమ్


విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా తమిళ చిత్రం 'సర్ మేడమ్' నటించిన జూలై 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కామెడీ, డ్రామా, రొమాన్స్ అన్ని ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా కనిపించింది.


సూత్రవాక్యం


షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే మలయాళంలో విడుదలవగా.. జులై 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఇందులో షైన్ ఒక పోలీస్ అధికారి పాత్రలో నటించారు.


ఓటీటీ సినిమాలు


హాట్ స్టార్

ద సొసైటీ - జూలై 21

రోంత్ - జూలై 22

సర్జమీన్‌ - జూలై 25

వాషింగ్టన్ బ్లాక్ - జూలై 23



నెట్‌ఫ్లిక్స్


మండల మర్డర్స్ - జులై 25

ద హంటింగ్ వైవ్స్- జూలై 21

మై మెలోడీ & కురోమి - జూలై 24

ట్రైన్ రెక్: పీఐ మామ్స్ - జూలై 22

క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ - జూలై 23

లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ - జూలై 2

హిట్ మేకర్స్ - జూలై 24

ట్రిగ్గర్- జూలై 25

అమెజాన్ ప్రైమ్


హ్యాండ్సమ్ గాయ్స్ - జూలై 24

జస్టిస్ ఆన్ ట్రయల్ - జూలై 21

నోవాక్సిన్ - జూలై 25

రంగీన్ - జూలై 25

టిన్ సోల్జర్ - జూలై 23