HariHaraVeeraMallu : మైత్రీ vs ఏషియన్ సినిమాస్..మధ్య పర్సంటేజ్ వార్..


 Power Start Pawan Kalyan: అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో రిలీజ్ తో కానుంది.

మూడేళ్ల తర్వాత వస్తున్న పవన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. ముఖ్యంగా ఏపీలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న థియేటర్స్ వద్ద కోలాహలం ఓ రేంజ్ లో ఉంది.

ఇదిలా ఉండగా నైజాంలో హరిహర వీరమల్లు రిలీజ్ పై రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు నువ్వా నేనా అని పంతాలకు పోతున్నాయి. నైజాంలో లోకల్ ప్లేయర్స్ కు డిస్ట్రిబ్యూటర్స్ కు టెర్మ్స్ పొత్తులు కుదరడం లేదు. పుష్ప 2 టైమ్ లో ఇరు పక్షాలు పట్టుదలకు వెళ్లాయి. ఆ టైమ్ లో మైత్రీ తమ సినిమాను ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శించలేదు. కానీ అదే రాబిన్ హుడ్ టైమ్ లో డిస్ట్రిబ్యూటర్ పట్టు పట్టలేదు. అయితే ఇప్పడు పవర్ స్టార్ సినిమాను నైజాంలో మైత్రీ విడుదల చేస్తుండడంతో మరోసారి ఈ పంచాయితీ తెరపైకి వచ్చింది. కానీ ప్రసాద్ మల్టిప్లెక్స్ తో వ్యవహారం సాఫీగా ముగిసింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేసారు. ఇక నైజాంలో అత్యధిక థియేటర్ చైన్ బినిజెస్ కలిగిన ఏషియన్ సినిమాస్ పర్సెంటేజ్ విధానంపై మైత్రీ పట్టుదలగా ఉంది. రెండు వైపులా సమస్య ఉందని, ఇద్దరి వాదనల్లో కరెక్ట్ పాయింట్లు వున్నాయాని తెలుస్తోంది. ప్రీమియర్స్ కు మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలిఉన్న కూడా ఏషియన్ సినిమాస్ సింగిల్ స్క్రీన్స్ లో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. మరి ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతారో.