Power star Pawan Kalyan: హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణల దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. ఐదేళ్ల పాటు ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇండస్ట్రీలోనే భారీ అంచనాలున్న హరిహర వీరమల్లు ఓపెనింగ్స్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ బిజీ
రిలీజ్‌కు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. జూలై 21న హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌తో పాటు అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానిని అలాగే కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ విశాఖలో మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. జూలై 23న విశాఖలో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం సందడి చేయనుంది.
హరిహర వీరమల్లు బడ్జెట్ ఎంత?
హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించారు. బాలీవుడ్ నటుడు, యానిమల్ విలన్ బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఇటీవల కన్నుమూసిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావుకు హరిహర వీరమల్లు చివరి సినిమా. ఆయన ఇందులో కీలకపాత్ర పోషించినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.