పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణ ముగిసింది.. ఆయన నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరిహర వీరమల్లు' ఎట్టకేలుకు ఈ జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హరి హర వీర మల్లు గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
సుమారుగా ఐదేళ్లు వాయిదాల మధ్య సాగిన ఈ చిత్రం, ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇటీవల విడుదలైన హరి హర వీర మల్లు ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఇంకా కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక ధర్మయోధుడిగా చారిత్రక పాత్రలో కనిపించనుండగా, హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో విరుచుకుపడతాడు. ఇక పోతే..
మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం, ఇప్పుడు వైజాగ్‌లోని బీచ్ రోడ్ వద్ద ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో (జూలై 23) అంటే ఈ రోజు మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుండగా. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, దర్శక నిర్మాతలు, నటీనటులతో పాటు, పలు రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ మొదట తిరుపతి లేదా విజయవాడలో ప్లాన్ చేసిన, అనివార్య కారణాలతో లొకేషన్ మారింది.