ఏం రా గుల్ఫామ్
ఏం గురాయించి చూస్తున్నావ్
భయపెట్టనీకా నారాజైనావ్
ఓహో శాలా మందిని సూసినంలే బిడ్డ
ఏం మునిమాణిక్యం సూసినవా గురాయించి చూస్తుండు బిడ్డ
మన లెక్క తెల్వద్
ఆహా వినాలి
వీరమల్లు మాట చెప్తే వినాలి
మ్ మ్ మ్ మ్
అబ్బన్న సుబ్బన్న కొట్టు
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఉత్తది గాదు మాట తత్తరపడక
చిత్తములోన చిన్న ఒద్దికుండాలి
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలిమంచి మాట వినాలి
ఈతమాను ఇల్లు గాదు
తాటిమాను తావుగాదు
ఈతమాను ఇల్లు గాదు
తాటిమాను తావుగాదు
తగిలినోడు మొగుడుగాదు
తగరము బంగారు గాదు
అందుకే మాట వినాలి గురుడా
మాట వినాలి
మాట వినాలిమంచి మాట వినాలి
ఆకు లేని అడవిలోన
అరెరె మేకలన్ని మేయవచ్చు
సద్దులేని కోనలోన
కొండచరియ కూలవచ్చు
మాట దాటిపోతే
మర్మము తెలియకపోతే
మాట దాటిపోతే
మర్మము తెలియకపోతే
పొగరుబోతు తగురుపోయి
కొండను తాకినట్టు
అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలిమంచి మాట వినాలి