Hari Hara Veera Mallu Movie Song కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో

 కోర కోర మీసాలతో

 కొదమ కొదమ అడుగులతో
 కొంటె కొంటె చెనుకులతో
 కొలిమిలాంటి మగతిమితో
  సరసర వచ్చినాడు
 చిచ్చర పిడుగంటివాడు
 ఎదో ఎదో తలచినాడు
 ఎవ్వరినో వెతికినాడు
  ఎవరంట ఎవరంట ఎవరెవరంట
 ఎవరంట ఎవరంట ఎవరెవరెవరెవరంట
  కొండపల్లి ఎండి బొమ్మా
 కోల కళ్లతో చూసిందమ్మా
 తియ్య తియ్యని తేనెలకొమ్మ ఆ ఆ ఆ
 తియ్యని తెరలే తీసిందమ్మా
 యాయియే
  వజ్రాల జిలుగులున్న యాయ్
 రత్నాల ఏలుగులున్న యాయ్
 కెంపుల్ల ఒంపులున్న
 మొహరీలా మెరుపులున్నా ఓ ఓ హో
  నా పైడి గుండెలోన ఏడి పుట్టించి
 మరిగించి మరిగించి కరిగించి కరిగించి
  కొల్లగొట్టినాదిరో కొల్లా గొట్టినాదిరో
 కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
 కొల్లగొట్టినాదిరో కొల్లా గొట్టినాదిరో
 ముల్లెగట్టినాదిరో ముల్లేగట్టినాదిరో
  నారిన్ననో నారిన్ననో నారిన్ననో ఓ ఓ
 నారిన్న నారిన్ననో
  అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
 ఆ చిన్నదీ ఇంకేమి చేసిందయ్యో
 అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
 ఆ కుర్రదీ ఏ మంత్రమేసిందయ్యో
  కన్నులలోని కాటుక మేఘం
 సీకటి నాపై సిలికిందే
 మాటలతోనే మెలికేసిందే
 మర్మం ఏదో దాసిందే
  ఆడవాళ్ళ మనసు అడవిలాంటిదని
 ఎరగని సంటోడివా
 అంత అమాయకుడివా
  పడుసుపిల్ల తీరు
 పట్టుసిక్కదని పసిగట్టలేనోడివా
 ఒట్టి శొంటికొమ్మువా
 లేత ఎన్నపూసవా
  అరె మీసాల రోషాల
 మొనగాన్ని పట్టేసి
 పసివాన్ని చేసేసి
 పసరేదో పూసేసి
  కొల్లగొట్టినాదిరో కొల్లా గొట్టినాదిరో
 కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
 కొల్లగొట్టినాదిరో కొల్లా గొట్టినాదిరో
 ముల్లెగట్టినాదిరో ముల్లేగట్టినాదిరో
  నారిన్ననో నారిన్ననో నారిన్ననో ఓ ఓ
 నారిన్న నారిన్ననో
  హొయ్ హొయ్ హొయ్
 హొయ్ హొయ్ హొయ్ హొయ్
 హొయ్ హొయ్ హొయ్
 హొయ్ హొయ్ హొయ్ హొయ్
  ఊపిరిలోని ఆవిరి పవనాలే
 విరివిగ లేఖలే విసిరేనే
 ఉప్పెనలాగ పొంగే పౌరుషమే
 సొగసుకు సంకెల వేసేనే
  చీకుచింత లేని వాడి చిత్తం దోచావే
 పారహుషార్ పోరగాడ్ని పాగల్ చేసావే
 దారెదైనా దవ్వేదైన నీడై ఉంటానే
 పేరేదైనా తీరేదైనా పెనిమిటి అంటానే
  అడ్డడ్డే కొల్లగొట్టినాదిరో కొల్లా గొట్టినాదిరో
 కొల్లగొట్టి నా గుండెనే ముల్లేగట్టినాదిరో
 కొల్లగొట్టినాదిరో కొల్లా గొట్టినాదిరో
 ముల్లెగట్టినాదిరో ముల్లేగట్టినాదిరో
  నారిన్ననో నారిన్ననో నారిన్ననో ఓ ఓ
 నారిన్న నారిన్ననో