Nari Nari Naduma Murari Song Iruvuri Bhamala

 ద్వాపరమంతా సవతుల సంత

 జ్ఞాపకముందా గోపాలా
 కలియుగమందు ఇద్దరి ముందు
 శిలవయ్యావే శ్రీ లోల
  కాపురాన ఆపదలను యిదిన శౌరి
 ఏది నాకు చూపవా ఒక దారి
  నారి నారి నడుమ మురారి
 నారి నారి నడుమ మురారి
  ఇరువురు భామల కౌగిలిలో స్వామి
 ఇరుకున పడి నీవు నలిగితివా
 ఇరువురు భామల కౌగిలిలో స్వామి
 ఇరుకున పడి నీవు నలిగితివా
  వలపుల వానల జల్లులలో స్వామి
 తలమునకలుగా తడిసితివా
  చిరుబురులాడేటి శ్రీదేవి
 నీ శిరస్సును వంచిన కథ కన్నా
 రుసరుసలాడేటి భూదేవి
 నీ పరువును తీసిన కథ విన్నా
  గోవిందా గోవిందా గోవిందా
  సాగిందా జోడు మద్దెల సంగీతం
 బాగుందా భామలిద్దరి భాగోతం
  ఇంటిలోన పోరంటే
 ఇంతింత కాదయా
 అన్నాడు ఆ యోగి వేమన
  నా తరమా
 భవసాగరమీదను
 అన్నాడు కంచర్ల గోపన్న
  పరమేశా గంగ విడుము
 పార్వతి చాలున్
 ఆ మాటలు విని ముంచకు
 స్వామి గంగన్
  ఇంతులిద్దరైనప్పుడు
 ఇంతే గతిలే
 సవతుల సంగ్రామంలో
 పతులది వెనకడుగే
  ఇంతులిద్దరైనప్పుడు
 ఇంతే గతిలే
 సవతుల సంగ్రామంలో
 పతులది వెనకడుగే
  ఇరువురు భామల కౌగిలిలో స్వామి
 ఇరుకున పడి నీవు నలిగితివా
  భామ కాలు తాకిందా
 కృష్ణుడే గోవిందా
 అన్నాడు ఆ నంది తిమ్మన
  ఒక మాట ఒక బాణం
 ఒక సీత నాదని
 అన్నాడు సాకేత రామన్న
  ఎధునాధా భామ విడుము
 రుక్మిణి చాలున్
 రఘునాధ సీతను గొని
 విడు సూర్పనఖన్
  రాసలీలలాడాలని
 నాకు లేదులే
 భయభక్తులు ఉన్న భామ
 ఒకతె చాలులే
  రాసలీలలాడాలని
 నాకు లేదులే
 భయభక్తులు ఉన్న భామ
 ఒకతె చాలులే
  ఇరువురు భామల కౌగిలిలో స్వామి
 ఇరుకున పడి నీవు నలిగితివా
 వలపుల వానల జల్లులలో స్వామి
 తలమునకలుగా తడిసితివా
  గోవిందా గోవిందా గోవిందా