Jagadeka Veeruni Katha 1961 movie songs Nanu Dayaganava

నను దయగనవా
నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాతా
ఇక శరణము నీవే మాతా
నను దయగనవా నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాతా
ఇక శరణము నీవే మాతా

అపశకునం అయేనమ్మా
ఇపుడే ఆపద పాలాయనో
అపశకునం అయేనమ్మా, ఇపుడే ఆపద పాలాయనో
ఎటు చూచెదవో , ఎటు బ్రోచెదవో
తనయుని భారం నీదే
నను దయగనవా, నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాతా
ఇక శరణం నీవే మాతా

ఆశా దీపం ఆరిపోవునా
చేసిన పూజలు విఫలములౌనా
నీవు వినా ఇక రక్షకులెవరే
కావగ రావా కావగ రావా
ఓ మాతా ఓ మాతా ఓ మాతా