దివి నుండి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ /2/
నువు పుట్టక ముందీ లోకం చీకటీ
నీ పలుకే ఎడిసన్ బల్బై ఉందా ఏమిటీ
నీ అందం మొత్తం.ఓఓఓ.... ఓ బుక్ గా రాస్తే ఆకాశం... ఓఓఓ
నీ సొగసునీ మొత్తం.. ఓఓఓ .....ఓ బంతిగా చేస్తే భూగోళం /దివి/
సెల్ఫీ తీస్తున్నానిన్నూ చూస్తూ కెమెరా కన్నూ క్లిక్ కే కొట్టడం మర్చిపోతుందే
స్పైసీ చూపుల్తో అట్టా చెంపా కొరికేస్తే నువ్వు
ఐఫోన్,యాపిల్ సింబల్ గుర్తొస్తొందే
కాఫీడేలో విన్నా సూఫీ.. మ్యూజిక్ లా
జుమ్మా జుమ్మాంది నీ అందం ఒక్కటే
దేశం బోర్డర్ లోని ఆసమ్ సోల్జర్ లాగా
కాటుక కళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ /దివీ/
సన్న నడుమొంపుల్లోన సగమే ఆ చందమామ
భల్లేగా లెఫ్టో రైటో సెటిలైయిందే
మ్యాన్లీ కనుపాపల్లోన
మండే ఓ ఫుజ్జియమ్మ
లావా వరదల్లే చుట్టూ ముడుతుందే
పిల్లా నువ్వే గానీ నేపాల్లో పుట్టి ఉంటే
ఎవరెస్ట్ మౌంటెన్నైనా హీటెక్కిస్తావే....
ఆడి కార్ సున్నాలాగా
నువ్వు నేను పెనవేస్తే
చూసే కళ్ళు పట్టపగలే ఫడ్ల్ లైట్స్ అవుతాయే ..../దివి/