Indrudu Chandrudu 1989 Kamal Hasan moviev songs Lali Jo Lali Jo Uruko Papayi

 లాలి జో లాలి జో ఊరుకో పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నా చేయి
  లాలి జో లాలి జో ఊరుకో పాపాయి 
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
  తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు
  కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
 ఆలినే కాదంది కాకినే కూడింది
  అంతలో ఏమైంది అడగవే పాపాయి  
పారిపోనీకుండా పట్టుకో నా చేయి  
 
మాయనే నమ్మింది బోయతో పోయింది 
 దెయ్యమే పూనిందో  రాయిలా మారింది  
వెళ్ళే పెడదారిలో  ముళ్ళే పొడిచాకనే 
 తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది 
 కన్నులే విప్పింది  గండమే తప్పింది 
ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
  పారిపోనీకుండా పట్టుకో నా చేయి
 
  పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఏడ్చారో 
గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు  
నేరం నాదైనా భారం నీపైన 
 తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా  
తల్లిలా మన్నించు మెల్లగా దండించు 
 కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా  
బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా