Paradise: Huge slum set for Natural Star movie

Nani


చురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ 'ప్యారడైజ్' (Paradise). ఇప్పటికే 'దసరా' (Dasara) తో దుమ్మురేపిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో రెండో సినిమా కావడంతో..
ఈ సారి అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ముక్కురింగు, పచ్చబొట్టు, పొడవాటి జడతో నాని కొత్త లుక్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. క్యారెక్టరే కాదు... సినిమాను కూడా నెవర్ బిఫోర్ అనేలా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేసిన సెట్స్ విశేషాలను టాలీవుడ్ లో బిగ్ డిబేట్ గా మారాయి.

'ప్యారడైజ్' సినిమా కోసం హైదరాబాద్ ఔటర్‌లో దాదాపు 30 ఎకరాల్లో భారీ స్లమ్ సెట్ వేశారు. ఈ సెట్ 'బాహుబలి' (Baahubali) మాహిష్మతిని తలదన్నేలా ఉందని టాలీవుడ్‌లో బిగ్ డిబేట్ నడుస్తోంది. అంతేకాదు.. స్లమ్ వరల్డ్ ను రియల్ గా చూపిస్తుందని చెబుతున్నారు. సెట్‌లో ఒక భారీ వంపు కథలో నాని పాత్రకు కీలకంగా ఉంటుందని... అది సినిమాకు రగ్గడ్ వైబ్ తెస్తుందని అంటున్నారు. ఈ సెట్ కేవలం షో కోసం కాదు... సినిమా కథకు ప్రాణం పోసేలా డిజైన్ చేశారట. నిర్మాతలు బడ్జెట్‌లో రాజీ పడకుండా, ప్రతి డీటెయిల్‌ను అచ్చం మురికివాడల్లాగా తీర్చిదిద్దారట. టీజర్, పోస్టర్‌లలో ఈ సెట్ నేచురాలిటీ ఇప్పటికే కనిపించింది.

మరోవైపు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander ) మ్యూజిక్ 'ప్యారడైజ్' హైప్ ను రెట్టింపు చేస్తోంది. 2026 మార్చి 26న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, స్పానిష్ లాంటి బహు భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సెట్‌తోనే సినిమా లెవెల్ వేరే ఉంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరోవైపు నాని ఈ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయట. 'దసరా' తర్వాత నాని-శ్రీకాంత్ జోడీ ఈ సినిమాతో మార్కెట్‌ను షేక్ చేయడం పక్కా అనే మాట వినిపిస్తోంది. గతంలో కూడా' దసరా' సినిమా కోసం ఓ ఊరి సెట్ నే వేశారు. ఇప్పుడు 'ప్యారడైజ్' కు భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్, నాని లుక్, సినిమా స్టోరీ నేచురల్ స్టార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కు కారణం అవుతాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.