Anupama Parameswaran అమాయకమైన చిరునవ్వు, అందమైన కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ సినిమా ప్రేమమ్ తో సెన్సేషన్ సృష్టించి, అక్కడి నుంచి నేరుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు రెండింట్లోనూ సమానంగా రాణిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న అనుపమ, టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ కలిగిన నటిగా నిలిచింది. ఇటీవల కిష్కింధపురితో విజయం సాధించింది. ఇక త్వరలో బైసన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ చిన్నతనంలో మనసులో నాటుకుపోయిన మాటలు, కలలపై ఎంత ప్రభావం చూపుతాయో చెడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
అనుపమ మాట్లాడుతూ.. 'నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ మా స్కూల్‌లో టాపర్స్‌కి మాత్రమే యాక్టింగ్‌లో అవకాశమిస్తారన్నది అనే వారు. ఎందుకంటే బాగా చదివే వాళ్లు.. పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకో గలుగుతారు.. గుర్తు పెట్టుకుని చెప్పగలుగుతారు అనేవాళ్లు. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. నేనెలాగూ స్కూల్ టాపర్‌ను కాదు కాబట్టి ఇక నటిని అవ్వలేనని భయం పడిపోయింది. అలా నటి కావాలన్న నా కలను పూర్తిగా పక్కకు పెట్టేశా. కానీ నాకు కొంచెం ఊహ తెలిశాకే చదువుకు.. నటనకు ఏ సంబంధం లేదని అర్థం అయింది. మేము చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తామోనన్న ఉద్దేశంతో స్కూల్‌లో అలా చెప్పేవారని తెలుసుకున్నా'' అని చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది అనుపమ.