OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీలో అత్యంత భయానక హారర్ థ్రిల్లర్ మూవీ.. ధైర్యముంటేనే చూడండి
ఈ చిత్రం ప్రపంచంలోనే ది మోస్ట్ హారర్ మూవీ అంటే అన్నాబెల్లె, కాంచన, అరణమనై, స్త్రీ 2, ది కంజురింగ్ వంటి టక్కున గుర్తకు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లో కూడా దాదాపు ఇదే కంటెంట్ తో నడుస్తోంది.
ఇందులోని కొన్ని సీన్లను చూస్తే ఒళ్లు జలధరిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది.. ఈ కథ విషయానికి వస్తే.. ఆడ్రియన్, సాండ్రా, వాళ్ల పిల్లలు నికి, కినన్‌లతో కలిసి వెకేషన్‌కి వెళ్తారు. సాయంత్రం సమయంలో కినన్ లేక్ వద్ద ఆడుకుంటూ హఠాత్తుగా కనిపించకుండా పోతాడు. సాండేకాలా అనే మిస్టికల్ జీవి, సూర్యాస్తమయంలో పిల్లలను కిడ్నాప్ చేస్తుందనే విషయం ఆడ్రియన్, సాండ్రాలకు తెలుస్తుంది. దీంతో వారు కినన్‌ని వెతకడానికి స్థానికులైన ఫైసల్, మజీద్ తో కలిసి అడవిలోకి వెళ్తారు. అక్కడ వారికి జైలాంగ్‌కంగ్ అనే ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ వల్ల వింత శబ్దాలు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. సాండేకాలా అనే వింత జీవి వాళ్లను కూడా వెంటాడుతుందని తెలుసుకుంటారు.
అయితే అడ్రియన్ గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు అతని కుటుంబాన్ని వెంటాడుతుందని స్థానికులు చెబుతారు. అలాగే సాండేకాలా ను శాంతపరచడానికి ఒక పూజ చేయాలంటారు. కానీ అది విఫలమవుతుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. మరి ఆడ్రియన్, కినన్ తో పాటు వారి పిల్లలు సాండేకాలా నుంచి బయట పడతారా? దాని చేతిలో బలవుతారా? అసలు ఆడ్రియెన్ ను వెంటాడుతోన్న శాపం ఏమిటి? దీనికి ఈ వింత జీవికి ఉన్న లింక్ ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.
ఇండోనేషియన్ హారర్ ల్లో ఎక్కువగా రిచ్యువల్ కంటెంట్ ఉంటుంది. అక్కడి ప్రజలు చేతబడి, క్షుద్ర పూజలను బాగా నమ్ముతారు.. విశ్వసిస్తారు. అందుకే అక్కడ ఇలాంటి రిచ్చువల్ కంటెంట్ ఉన్న లు ఎక్కువగా వస్తుంటాయి. ఇక మనం మాట్లాడుకున్న పేరు 'జైలాంగ్‌కంగ్: సాండేకాలా. . కిమో స్టాంబోయల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో టిటి కమల్ (సాండ్రా), డ్వి సాసోనో (అడ్రియన్), సైఫా హడ్జు (నికి), ముజక్కి రామ్‌ధన్ (కినన్), జూలియో పరెంగ్‌కువాన్ (ఫైసల్), మైక్ లూకాక్ (మజీద్) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ హారర్ మంచి టైమ్ పాస్ అని చెప్పవచ్చు.