Kingdom Movie OTT: భాగ్యశ్రీ ఫ్యాన్స్ మళ్లీ హర్ట్ అయ్యారు


Vijay Devarakonda 'కింగ్డమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల చివరలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి తొలిరోజు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత సీన్ మారిపోయింది.

ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు కానీ ఒకటి రెండు సీన్లు తప్పితే చిత్రంలో అస్సలు ఈమెని సరిగా ఉపయోగించుకోలేదు. సరే డిజిటల్ స్ట్రీమింగ్‌లోనైనా సరే హ్యాపీ అవుతుందనుకుంటే ఇక్కడా డిసప్పాయింట్ చేశారు.


ఈ సినిమాలో 'హృదయం లోపల' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ఉంది. మూవీ రిలీజ్‌కి ముందే ఈ పాట వీడియో రిలీజ్ చేశారు. తీరా చూస్తే థియేటర్లలో ఈ గీతం కనిపించలేదు. దీనికి కారణాన్ని చెబుతూ స్టోరీలో సెట్ కాలేదు కాబట్టి తీసేశాం అని నిర్మాత నాగవంశీ చెప్పారు. సరే ఓటీటీలోకి వచ్చాక అయినా సరే ఉంటుందిలే అనుకుంటే ఇక్కడ కూడా తీసేశారు. దీంతో భాగ్యశ్రీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు.


'కింగ్డమ్' మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ. దీనిపై విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ దీవిలో శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.