ప్రముఖ నటి భవన నటించిన తమిళ భాషా హర్రర్ థ్రిల్లర్ 'ది డోర్' మార్చి 2025లో థియేటర్లలోకి వచ్చింది. థియేట్రికల్ విడుదలైన ఐదు నెలల తరువాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రం ప్రస్తుతం తమిళ ఆడియోతో పాటు ఆహా తమిళంపై ఇంగ్లీష్ ఉపశీర్షికలతో మాత్రమే ప్రసారం అవుతోంది. డబ్ వెర్షన్స్ గురించి తదుపరి అప్డేట్స్ లేవు. ఈ చిత్రంలో భవన తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో భవన వాస్తుశిల్పిగా నటించారు. భవనా సోదరుడు జైదేవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గణేష్ వెంకట్రామన్, ప్రియా వెంకట్, జయప్రకాష్, శ్రీరాంజిని మరియు ఇతరులు సహాయక పాత్రలలో నటించారు. నవీన్ రాజన్ ఈ సినిమాని నిర్మించాడు.