అలనాటి ధర్మేంద్ర వారసులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్, అభయ్ డియోల్.. బాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. పెద్ద కొడుకు సన్నీ డియోల్ ఇప్పటికీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ, సూపర్ హిట్లు కొడుతున్నాడు.
రెండో కొడుకు బాబీ డియోల్, హీరోగా కెరీర్‌లో గ్యాప్ రావడంతో 'యానిమల్' మూవీతో విలన్‌గా మారాడు. ప్రస్తుతం మోస్ట్ బిజీ విలన్‌గా మారాడు. ఇక ధర్మేంద్ర తమ్ముడు అర్జిత్ సింగ్ డియోల్ కొడుకు అభయ్ డియోల్, హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అయితే నటుడిగా బ్రేక్ మాత్రం దక్కించుకోలేకపోయాడు..
2005లో అయేషా టాకియాతో కలిసి ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో 'సోచా నా థా' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభయ్ డియోల్. 'జబ్ వీ మెట్', 'లవ్ ఆజ్ కల్', 'రాక్ స్టార్', 'తమాషా', 'హైవే' వంటి క్లాసిక్స్ అందించిన ఇంతియాజ్ ఆలీకి దర్శకుడిగా 'సోచా నా థా' మొదటి సినిమా.. పాజిటివ్ రివ్యూలు తెచ్చుకున్న ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది..
తన 20 ఏళ్ల నట ప్రస్థానంలో 23 సినిమాలు, 4 వెబ్ సిరీస్‌లు చేశాడు అభయ్ డియోల్. అందులో కేవలం 3 మాత్రం హిట్ అయ్యాయి. అనురాగ్ కశ్యప్‌తో చేసిన 'dev d' మాత్రం అభయ్ డియోల్‌కి హీరోగా దక్కిన ఏకైక సక్సెస్. 'జిందగీ నా మిలేగి దుబారా', 'రాంఝానా' చిత్రాల్లో అభయ్, సైడ్ హీరోగా నటించాడు. అభయ్ నటించిన 14 సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి.
సినిమాల్లో ఫ్లాప్ అయినా బిజినెస్‌మ్యాన్‌గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు అభయ్ డియోల్. 'ది ఫ్యాటీ కౌ' (The Fatty Cow) పేరుతో రెస్టారెంట్ ఛైయిన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అభయ్ డియోల్. అలాగే 'Forbidden Films' పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని మొదలెట్టాడు. రియల్ ఎస్టేట్‌లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఇలా వ్యాపారంలో రూ.400 కోట్లకు పైనే ఆస్తులు సంపాదించాడు అభయ్ డియోల్..
ముంబైలో అభయ్ డియోల్, చాలా ఏళ్ల క్రితమే రూ.27 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్నాడు. ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే గోవాలో పర్యావరణ అనుకూలమైన గ్లాస్ ఇంటిని నిర్మించుకున్నాడు. అంతేకాదు పంజాబ్, ముంబైలో కూడా అభయ్‌కి ఆస్తులు ఉన్నాయి..
అన్నలు సన్నీ డియోల్, బాబీ డియోల్ కంటే అభయ్ డియోల్ ఆస్తుల విలువ దాదాపు రెట్టింపు ఉంటుంది. సినిమాల్లో సక్సెస్ సాధించకపోయినా వ్యాపార రంగంలో స్టార్‌గా ఎదిగాడు అభయ్ డియోల్. చివరిగా 'ట్రయల్ బై ఫైర్' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు అభయ్ డియోల్..