Rashmi Gautam TV Shows: 'జబర్దస్త్' పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సెలబ్రిటీలలో రష్మీ గౌతమ్ ఒకరు. ఆ షో యాంకరింగ్ చేయడం ద్వారా ఆవిడ చాలా పాపులర్ అయ్యారు.
తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో చాలా స్ఫూర్తిగా, నిర్మొహమాటంగా వెల్లడించే రష్మీ గౌతమ్, నెల రోజుల పాటు ఆ సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...
డిజిటల్ డిటాక్స్... వన్ మంత్ బ్రేక్!
''హలో... నెల రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని (డిజిటల్ డిటాక్స్) నిర్ణయించుకున్నాను. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన అంశాలలోనూ కాస్త 'లో'లో ఉన్నాను (అనుకోనివి జరగడం వల్ల బాధ పడటం కావచ్చు). ఈ టైంలో నేను తీసుకునే నిర్ణయాలను సోషల్ మీడియా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకని, బ్రేక్ తీసుకుంటున్నాను. అయితే ఒక్కటి మాత్రం ప్రామిస్ చేయగలను. మరింత శక్తివంతంగా మీ ముందుకు వస్తాను. నేను మునుపటిలా హుషారుగా ఉండటానికి నా ఎనర్జీని మళ్ళీ పొందాలి. నా మీద ఎవరి ప్రభావం ఉండకూడదు. నేను ఎప్పుడూ స్టాంగ్‌గా ఉంటాను. అయితే కొన్ని విషయాలను సరి చేయాల్సిన సమయం వచ్చింది. నేను సోషల్ మీడియాకు కాస్త విరామం ఇస్తున్నా మీ ప్రేమ, అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను'' అని రష్మీ గౌతమ్ పేర్కొన్నారు.