యూట్యూబ్ చూసేవాళ్లందరికీ నా అన్వేషణ ఛానల్ సుపరిచితమే. ప్రపంచ యాత్రికుడిని అంటూ అన్ని దేశాలు తిరుగుతూ అక్కడి వింతలు విశేషాలను తన ఛానల్ ద్వారా చూపిస్తుంటాడు అన్వేష్.
అతడి యూట్యూబ్ ఛానల్‌కి 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీడియో పెట్టాడంటే నిమిషాల్లోనే లక్షల వ్యూస్ వచ్చేస్తుంటాయి. కేవలం ట్రావెలింగ్ గురించే కాకుండా సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల గురించి కూడా స్పందిస్తూ వీడియోలు తీస్తుంటాడు. అతడి వీడియోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో.. అంతకంటే ఎక్కువగా ట్రోలింగ్‌కి కూడా గురవుతుంటాయి. అవన్నీ పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్తూనే ఉంటాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకి లక్షల రూపాయలు సంపాదించే నా అన్వేషణ తాజాగా సినిమా రివ్యూయర్ అవతారమెత్తాడు. పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా రివ్యూని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు అన్వేష్. అయితే వీడియో కాస్త ముందుకెళ్లాక అసలు ట్విస్ట్ రివీల్ చేసి అందరికీ షాకిచ్చాడు. ఇంతకీ నా అన్వేషణ చెప్పిన 'వీరమల్లు' రివ్యూ ఎలా ఉందంటే...
* వీరమల్లు' కోసం టన్ను పేపర్లు సిద్ధం... థియేటర్ తగబెట్టేస్తారేమో!
పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు' సూపర్ డూపర్ హిట్. ఇప్పుడే చూసొచ్చాను. ఇప్పుడు నేను సౌతాఫ్రికాలో ఉన్నా. మూవీ అదిరిపోయిందండి. మూవీలో కళ్యాణ్ యాక్టింగ్ అదిరిపోయింది. ఇంక మాటల్లేవ్. చారిత్రాత్మక సినిమా స్టోరీ చెప్తాను జాగ్రత్తగా వినండి. 11వ శతాబ్దం హరిహరరాయులు, బుక్కరాయులు కాకతీయ సామ్రాజ్యం స్టోరీ, వీళ్లిద్దరు కాకతీయ సామ్రాజ్యం కోల్పోయాక కొత్త సామ్రాజ్యం ఏర్పరచుకోవడం కోసం తిరుగుతున్న సమయంలో మహ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్యంలో చేరి ఆ తర్వాత అక్కడి నుంచి విడిపోయి విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారు. వాళ్ళకి పుట్టిన కొడుకే మన హరిహార వీరమల్లు. ఈ హరిహార వీరమల్లు ఎత్తైన గోడలు కట్టి రాజ్యాన్ని అద్బుతంగా పరిపాలిస్తుంటాడు. మనందరికి తెలిసిన శ్రీకృష్ణదేవరాయులు తాతే మన హరిహర వీరమల్లు. ఆ రోజుల్లో ముస్లిం రాజుల మీద దండయాత్ర చేసి కోహినూరు డైమండ్ ని ఎత్తుకెళ్ళిపోయిన ఔరంగజేబును ఎదిరిస్తాడు.
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కామెడీ, సెంటిమెంట్, ఫైట్లు చేశారు కానీ తొలిసారి చారిత్రక యోధుడిగా అదరగొట్టేశారు. ఆయన నటన నభూతో నభవిష్యతి. ఇందులో మన బాలయ్య బాబు కూడా ఉన్నారు. అదే సినిమాలో ట్విస్ట్. హరిహర వీరమల్లు మనవడిగా శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ఆయన ఎంట్రీ పీక్స్. ఆయన వస్తుంటే ప్రేక్షకులకి గూస్‌బంప్స్ వచ్చేస్తాయి. ఈ సినిమా చూసి ఆఫ్రికా ప్రలు కూడా ఈలలు, కేకలు వేసేస్తున్నారు. కుటుంబసమేతంగా చూడాల్సిన అద్భుతమైన సినిమా ఇది' అంటూ తనదైన స్టైల్‌లో రివ్యూ చెప్పుకుంటూ వెళ్లిపోయాడు నా అన్వేషణ. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ రివీల్ చేశాడు. ఇదంతా నిజంగా సినిమా రివ్యూ కాదు. సినిమా రివ్యూలు ఇచ్చే వాళ్లమీద సెటైరికల్‌గా చేసిన వీడియో అట. ఈ వీడియోలో రివ్యూయర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు నా అన్వేషణ.