Pavitra Bandham

 VENKATESH SOUNDARYA

  •  Movie:  Pavitra Bandham
  •  Cast:  Soundarya,Venkatesh
  •  Music Director:  M M Keeravani
  •  Year:  1996
  •  Label:  T-Series

Song:  Apurupamainadamma



కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మా ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మా ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపుతాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మాగాణి మంచి కోసం పడే ఆస్తిలో సతిని మించగలరా మారె ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్ధము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మా ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాణి కాలం వేలే వేసినా విడిచి పోనీ బంధం తానై ఉండగా సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు అపురూపమైనదమ్మా ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ