నా ప్రాణమా నను వీడి పోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్న వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనిత అనితా.... అనితా... ఓ వనితా
నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా
నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరుగనీకుమా
నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా
నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకుని పడివున్నా
కలలో కూడా నీ రూపం నను కలవరపరిచెనే
కనుపాప నిను చూడాలని కన్నీరే పెట్టెనే
నువ్వొక చోట నేనొక చోటా
నిను చూడకుండగా క్షణముండలేనుగా
నా పాటకు ప్రాణం నీవే.. నా రేపటి స్వప్నం నీవే నా
ఆశల రాణివి నీవే నా గుండెకు గాయం చేయకే
అనిత అనితా.... అనితా... ఓ వనితా
నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా
నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరుగనీకుమా
నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా
ప్రతిక్షణము థ్యానిస్తూ పసిపాపలా చూస్తా
విసుగురాని నా హృదయం నీ పిలుపుకై ఎదురుచూశే
నిను పొందని ఈ జన్మే నా కెందుకని అంటుంటే
కరుణిస్తావో కాటేస్తావో నువు కాదని అంటే నే శిలనవుతాను
నను వీడని నీడవు నీవే
ప్రతి జన్మకు తోడువు నీవే
నా కమ్మని కలలు కూల్చి నను ఒంటరి వాడ్ని చేయకే....
అనిత అనితా.... అనితా... ఓ వనితా
నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా
నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరుగనీకుమా
పదే పదే నా మనసే నినే కలవరిస్తోంది
వద్దన్న వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనిత అనితా.... అనితా... ఓ వనితా
నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా
ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు
నిను ప్రేమిస్తూనే ఉంటా
అనిత అనితా.... అనితా... ఓ వనితా
నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా