Ananthapuram Movie Song Konte Chooputho nee Konte chooputho

 

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో 
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయచేసి  అంతలోనే మౌనమేలనే

మాట రాని మౌనం మనసే తెలిపే 
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
 కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటే నాలో పలికినది


పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నదీ 
తడబడు గుండెలో మోమాటమిది

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో 
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయచేసి  అంతలోనే మౌనమేలనే

కళ్ళలో నిద్రించీ కలలే ముద్రించీ మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించీ నిన్నే శ్యాసించీ నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే నువ్వుంటే  చెంత

 కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటే నాలో పలికినది

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో 
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయచేసి  అంతలోనే మౌనమేలనే