తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తియ్యా తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగామయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తియ్యా మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినింతవరకు నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి నన్నింకొక నందిగా ముడెయ్యి నీ గాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా శివా శివా శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధరా స్వర్ణముఖీ తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారెంటా కొమ్మలు శివ శూలాలే మబ్బుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే యాడ చూడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్ల గాలులే ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయెరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివయ్యను పేరుకు పెనవేసుకుంటిరా ఆ ఆ శివా శివా శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధరా ఓ ఓ కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా అడివిమల్లె పూలదండ అలంకరించనా నా ఇంటీ చంటి బిడ్డవు నువ్వు ముపొద్దూనీతో నవ్వుల కొలువు దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా ఓయ్ శివయ్య ఇప్ప తేనే ఉంది విందు చేయనా నిను సాకుతా కొనసాగుతలే బతుకు పొడుగునా ఆ ఆ ఎండకు జడివానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మంచుకు విలవిల ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడ చెలిగాడు నేనేరా కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య ఆస్తిపాస్తులన్నీ నీయి కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయంగుందా ఈ పైనా నిన్ను వదిలేదుందా ఎట్టగట్టనో తల తిరిగి పొగసిన తాపమంతా కరిగి శివయ్య అని సిగముడిలో సెక్కుకుంటిరా పొమ్మని ఇదిలించినా కసురుతూ కరిగించినా శూలముతో పొడిచినా పాములు కరిపించినా నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా శివా శివా శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధర హరహర హరహర హరహర హరహర హరనే శివనే హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర శంకరా ఆ ఆ ఆ శివా శంకరా ఆ ఆ ఆ ఆ శివా ఆ ఆ శివా ఆ ఆ ఆ