DjTillu Songs Lyrics
1. Ticket Eh Konakunda songs lyrics
టికెటే కొనకుండా
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా ఆ
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
మురిసిపోకు ముందున్నాది
కొంప కొల్లేరయ్యే తేది ఓహో
గాలికి పోయే కంప
నెత్తి కొచ్చి సుట్టుకున్నాది హా
ఆలి లేదు సూలు లేదు
గాలే తప్ప మ్యాటరు లేదు ఆహా
ఏది ఏమైన గాని
టిల్లు గానికడ్డే లేదు
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా
స్టోరీ మళ్ళీ రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు
తానా తందనా
టిల్లన్న ఎట్ల నీకు జెప్పాలన్నా
తెలిసీ తెల్వక జేత్తావన్న
ఇల్లే పీకి పందిరి ఏస్తావ్
ఏందీ హైరానా
టికెటే కొనకుండా
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
అల్లి గాడు మల్లి గాడు కాదు
టిల్లు గాడు కిర్రాకీడు
మందులోకి పల్లీ లాగ
లొల్లి లేకుండా ఉండ లేడు
తొందరెక్కువమ్మ వీడికి
తెల్లారకుండా కూసేస్తాడు
బోని కొట్టకుండా నేను
డాడీ నైపోయానంటాడు
అయ్యనే లెక్క జెయ్యడు
ఎవ్వడయ్యెచ్చి జెప్పిన ఆగడు
పోరడు అస్సలినడు
సిత్తరాలే సూపిత్తడు
ప్రేమిస్తడు పడి చస్తడు
ప్రాణమిమ్మంటే ఇచ్చేస్తడు
తగులుకుండంటే వదులుకోలేడు
బిడ్డ ఆగమై పోతున్నాడు
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా
స్టోరీ మళ్ళీ రిపీటేనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు
తానా తందనా
టిల్లన్న ఎట్ల నీకు జెప్పాలన్నా
తెలిసీ తెల్వక జేత్తావన్న
ఇల్లే పీకి పందిరి ఏస్తావ్
ఏందీ హైరానా
టికెటే కొనకుండా
లాటరీ కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సుడరా బుల్లోడా
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ పబ్బు కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
2. రాధిక రాధిక రాధిక రాధిక songs lyrics
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలేందే ఇక
కాటుక కళ్లతోటి కాటే వేసావే
నువ్వు సూటిగా చూసి
దిల్లు టైటే చేసావే భళా భళా
మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే
డెలికేటు మైండు మొత్తం
బ్లాకే చేసావే
చక్కర్లు కొడుతున్నానే
కుక్కపిల్ల లాగా
నువ్వేసే బిస్కెట్లకు
మరిగానే బాగా
చాక్లెటు గుంజుకున్న
సంటిపోరన్లాగా
నన్నేడిపిస్తున్నావే
గిల్ల గిల్ల కొట్టుకోగా
నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే
రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే హా
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
హ బేబీ అంటూ పిలిచి
బతుకు దోబీ ఘాటు చేసావే
డార్లింగ్ అంటూ గోకి
గుండెల్లో బోరింగు దింపేసినావే
పతంగిలా పైకి లేపి
మధ్యలో మాంజ కొసేసినావే
బలికా బకరాని చేసి
పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే
అరెరె
నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే ఆహ
నీ బొంగులో మాటలిని పడిపోయానే ఏయ్
రంగుల కొంగు తాకి పడిపోయానే ఆహ
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుకా ఎనకకా కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
3. Oh My Lily sogs lyrics
ఏయమ్మో ఓయమ్మో
ఓహ్ మై లిల్లీ ఓహ్ మై లిల్లీ
ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమా
ఓ మై లిలీ ఓ మై లిలి
మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళి
ఓ తొలిసారి జరిగింది సరిపోలేదే
ఈసారి జరిగింది తెలియనె లేదే
ఆగే తల్లి ఏందీ లొల్లి
జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ
ఏయమ్మో ఓయమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏయమ్మో ఓయమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఓ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ
పక్కకి రమ్మ లిల్లీ లిల్లీ
దువ్వెన వొళ్ళు లిల్లీ లిల్లీ
కాటుక కళ్ళు ఓహ్ మై లిల్లీ లిల్లీ
మొదలెట్టే ముందే అడిగా నిన్ను
వదిలేసి వేళ్ళకు తడిగా
సర్దుకు పోలేను సరిపెట్టుకు పోలేను
ఉండలేను ఒంటరిగా
పసిగట్టేలోపే పరిగెత్తుకెళ్లావ్
ఈ తొందరేంటి నీకసలు
కరువయిన మనసు
బరువెక్కిపోయింది
తట్టుకోలేనే దరువు
నెమ్మదిగా నన్నడుగు
మెల్లంగ మబ్బేసిపోకు
నువ్వు సమ్మగా తాకేసి పొతే
ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి
మనసేందుకు విరిగింది
మల్లి మల్లి
నా మనసేందుకు విరిగింది
మల్లి మల్లి
ఆగే తల్లి ఏందీ లొల్లి
జరగాలి టిల్లుకి మల్లి మల్లి
ఓహ్ మై లిల్లీ ఓహ్ మై లిల్లీ
ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమా
ఓ తొలిసారి జరిగింది సరిపోలేదే
ఈసారి జరిగింది తెలియనె లేదే
ఆగే తల్లి ఏందీ లొల్లి
జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ
ఏయమ్మో ఓయమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏయమ్మో ఓయమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఓ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ
పక్కకి రమ్మ లిల్లీ లిల్లీ
దువ్వెన వొళ్ళు లిల్లీ లిల్లీ
కాటుక కళ్ళు ఓహ్ మై లిల్లీ లిల్లీ