- Movie: Yamaleela
Song: Abhi Vandanam
ధర్మ పరిరక్షణ ధురంధరుండ
సకల పాపా శిక్షణ దక్షుణ్డా
చండ తార దండ ధర బహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్ములన నియముండ
హ యముండ
అభి వందనం యమా రాజాగ్రణి
సుస్వాగతం సుర చూడామణి
తమ సుగుణాలు పలుమారు కీర్తించని
ఆ ఆఅ ఆఆఆ
ఏమి శబాష్
శహబాసులే నర నారీమణి
బహు బాగులే సుకుమారి మని
నిను మెచ్చాను వచ్చాను రా రమ్మని
ఆ ఆఅ ఆఆఆ
స గ ప మా ప ని ని ప మా గ మా గ
గ మా గ మా ప మా ప ని స ని ప మా ప
సరసాలు చవి చూడ ఇటు రా దొరా
నవ మన్మధాకారా నడుమందుకోరా
రాకాసి కింకరుల రారాజునే
నరకానా నీవంటి సరుకేపుడు కననే
పాపలు తెగ మోసి తల మాసేనేమో
నా పాల పడి కాస్త సుఖమందుకోవోయ్
ఆ ఆఅ ఆఆ
అవశ్యము అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రాసాలోకమే ఇక మన కాపురం
యమా సరదాగా సాగాలి ఈ సంబరం
ఆ ఆఅ ఆఆ
ఉర్వశికి నీవేమి కజిన్ అవుదువా
కాకున్నా నీకింత సౌందర్యమేల
నరలోకమున ఉరికొక ఊర్వశి
స్వర్గాలే దిగి వచ్చు మా కులుకు చూసి
ఊరించాకే ఇక నా రాజా హంస
యమహాయి నీదేలే రసికావతంస
ఆ ఆఅ ఆఆ
రసికాగ్రేసరుఁడ యముండ
మైకలలో తమ మతి పోవఁగ
నాకేళిలో పడి మునకేయగా
రద వదిలేసి ఒడిలోకి రా దేవర
ఆ ఆఅ ఆఆ
మజ్జారే మాదవతి
శహబాసులే నార నారీమణి
బహు బాగులే సుకుమారి మని
నిను మెచ్చాను వచ్చాను రా రమ్మని
ఆ ఆఅ ఆఆ
ధర్మ పరిరక్షణ ధురంధరుండ
సకల పాపా శిక్షణ దక్షుణ్డా
చండ తార దండా ధర బహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్ములన నియముండా
హ యముండ