Shubha Sankalpam Song: Mudu mullu vesinaka

 


మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు గూటి బయటే గుట్టులట ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంటా ఎంకి పాట ఆకుపచ్చ కొండల్లో ఓఓఓఓ గోరు వెచ్చ గుండెల్లో ఆకుపచ్చ కొండల్లో గోరు వెచ్చ గుండెల్లో ముక్కు పచ్చలారబెట్టి ముద్దులంట మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు గూటి బయటే గుట్టులట ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంటా ఎంకి పాట అహ్హహ్హ ఓయి పుష్య మసమొచ్చింది భోగి మంటలేసింది కొత్త వేడి పుట్టింది గుండెలోన హ హ రేగు మంట పులకే రేచిపోకు తుమ్మెద కాచుకున్న ఈడునే దోచుకుంటే తుమ్మెద మంచు దేవతోచిందా మంచమెక్కి కుకుందా అః అః వణుకులమ్మ తిరణాల్లే ఓరి నయానో సీతమ్మోరి సిటికిన యేలు సిలికా తొడిగితే సిగ్గులెర్రన రాములోరి ఆ సిలికా కొరికితే సీతమ్మోరి బుగ్గలెర్రన మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు గూటి బయటే గుట్టులట ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంటా ఎంకి పాట వయసు చేదు తెలిసింది మనసు పులుపు కోరింది చింత చెట్టు వెతికింది చీకటింట హ హ కొత్త కొరికేమిటో చెప్పుకోవే కోయిల వుత్తా మాటలెందుకు తెచ్చుకోరా ఊయల హ హ ముద్దు వాన వెలిసింది పొద్దు పొడుపు తెలిసింది వయసు వరస మారింది ఓరి మన్మధా మూడు మూళ్ళ జాతలోన ముగ్గురైనా ఇంటిలోనా జోరు కాస్త తగ్గనీరా జో జో జో జో జో జో జో జో జో