Shuba Lagnam Song: Poruginti Mangala

 

  •  Movie:  Shuba Lagnam
  • Song:  Poruginti Mangala


పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసులపేరు చూడు ఇరుగు పొరుగువాళ్ళు భలే బాగుపడ్డారు నాగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకు మల్లె ఎవరు ఉన్నారు ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇట్టా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది పక్కవాళ్ళ పాడుగొల పట్టించుకోవద్దే పొరుగింటి పుల్లకూర తెగ మెచ్చుకోవద్దే నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే అందని పళ్లకు అర్రులు చాచి అల్లరిపాడొద్దే మనకి లేక అదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా ఎందుకే ఇట్టా రోజు మెదడు తింటావు ఇంటిగుట్టంతా వీధిన పెట్టుకుంటావు కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైన లేదే పాపం తమ జీతం నేత చీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు ఉందే అందం నీ సొంతం ఉత్తి మాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిదిగా కట్టుకున్నదాని సంబరం తీర్చడమే పురుష లక్షణం సంపదలోనే లేదు సంతోషం చంపకే నన్ను నీ డాబుకోసం పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసులపేరు చూడు ఫలానా వారి మిస్సెసెంటు అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా ఆ బోడి పదవికాని అప్పో తప్పో చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా కానీకి కొరగాని పరువూ ఓ పరువేనా మగాణ్ణి తూచేది వాడి పర్సు బరువేనా డబ్బులేని దర్పమెందుకు అయ్యో చేతకాని శౌర్యమెందుకు నీకు మొగుడయే యోగ్యత మనిషికి లేదే ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసులపేరు చూడు ఇరుగు పొరుగువాళ్ళు భలే బాగుపడ్డారు నాగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకి లేక అదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా మన బతుకేమో ఇట్టా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఎందుకే ఇట్టా రోజు మెదడు తింటావు ఇంటిగుట్టంతా వీధిన పెట్టుకుంటావు