- Movie: Shuba Lagnam
- Song: Chilaka Ye Thodu Leka
చిలకా ఏ తోడు లేకా ఎటెపమ్మా ఒంటరి నడకా
తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనకా
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాకా
చిలకా ఏ తోడు లేకా ఎటెపమ్మా ఒంటరి నడకా
తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనకా
గోరింకా ఎదే మైనా లేదింకా
గోరింకా ఎదే మైనా లేదింకా
బతుకంతా బలీ చేసే పేరాశనూ ప్రేమించావే
బతుకంతా బలీ చేసే పేరాశనూ ప్రేమించావే
వెలుగుల్నే వేలి వేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించీ ఆ విలువతో
హాలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
చిలకా ఏ తోడు లేకా ఎటెపమ్మా ఒంటరి నడకా
తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనకా
కొండంత అండే నీకు లేదింకా
కొండంత అండే నీకు లేదింకా
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాసితో అనాధగా మిగిలావే అమావాసలో
తీరా నువ్వు కను తెరిచాక తీరం కనపడదే ఇంకా
చిలకా ఏ తోడు లేకా ఎటెపమ్మా ఒంటరి నడకా
తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనకా
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాకా
చిలకా ఏ తోడు లేకా ఎటెపమ్మా ఒంటరి నడకా
తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనకా