Sakhi Movie Song Alai pongera

 Sakhi Movie Song Alai pongera


అలై పొంగెరా కన్నా

మానసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీ నవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రా దొర ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా ఆ కనుల వెన్నెల పట్టపగల్ పాల్చిలుకగా కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే కన్నె మోమున కనుబొమ్మలటు పొంగె కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నె వయసు కళలొలికే వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే అనంతమనాది వసంత పదాల సరాగసరాల స్వరానివా నిశాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా కడలికి అలలకు కధకళి కళలిడు శశికిరణమువలె చలించవా చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలే రచించవా కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో ఇది తగులో ఎద తగవో ఇది ధర్మం ఔనో ఇది తగులో ఎద తగవో ఇది ధర్మం ఔనో కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగా అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా నీ ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా కన్నా ఆ ఆ ఆ