Priya Raagalu Movie Song Chinna Chiru
చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
నా ప్రేమ పోత పోసి కన్నానురా
నిను శ్రీ రామరక్షా లాగా కాపాడగ
నీలో ఉన్న నీతో ఉన్న
చిన్నా
అటు చూడు అందాల రామచిలకని
చూస్తోంది నిన్నేదో అడుగుదామని
నీ పలుకు తనకి నేర్పవ అని
ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని
పడుతోంది లేస్తోంది ఎందుకో మరి
నీ లాగ పరుగు చూపుదామని
కరిగిపోని నా తీపి కలలని
తిరిగి రాణి నా చిన్న తనముని
నీ రూపంలో చూస్తూ ఉన్న
చిన్నా చిరు చిరు నవ్వుల చిన్న
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
తూనీగ నీలాగా ఎగర లేదురా
ఆ పూవాయ్ నీలాగా గెంత లేదురా
ఈ పరుగులు ఇంకా ఎంత సేపురా
ఈ ఆట ఈపూట ఇంకా చాలురా
నా గారాల మారాజా కాస్త ఆగరా
నీ వెంట నేను సాగలేనురా
ఎంత వెతికిన దొరకనంతగా
ఎంత పిలిచినా పలకనంతగా
వెళిపోకమ్మ రారా కన్నా
చిన్నా చిరు చిరు నవ్వుల చిన్న
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
నా ప్రేమ పోత పోసి కన్నానురా
నిను శ్రీ రామరక్షా లాగా కాపాడగ
నీలో ఉన్న నీతో ఉన్న చిన్నా