Premikula Roju Movie Song Daandiyaa aatalu
దాండియా ఆటలు ఆడ
సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ
ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
దాండియా ఆటలు ఆడ
సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ
ప్రియుడే చెలికై చూడ
నిన్ను చూసి నన్ను నేను మరిచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగువున్న
ఆ మాట తెలిసిందా
నిన్ను చూసి నాలో నేను మురిసి
అసలు మాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
ఓ కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా
ఓ కళ్లలోన కాటుక కరిగిపోవునంట
కురులలోన పువ్వులన్నీ వాడిపోవునంట
నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఈ మాట మాత్రమే నిజమైతే
నా జన్మే ధన్యం
నా ప్రేమ నీవేలే
నా ప్రేమ నీవేలే
దాండియా ఆటలు ఆడ
సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ
ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
ప్రేమ చూపులో ఉంది మహత్వం
ప్రేమ భాషలో ఉంది కవిత్వం
ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం
ప్రేమ సృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం
ఓ నా మనససు నీలో దాచి ఉంచినాను
ఆ మనససు క్షేమేనా
తెలుసుకొనుట వచ్చాను
ఓ నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను
నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు
హృదయాలు రెండని అనలేవు
ఇది నీదినాదని కనలేవు
ఈ మాటమత్రమే నిజమైతే
నా జన్మే ధన్యం
నా ప్రేమ నీవేలే
నా ప్రేమ నీవేలే
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి
దాండియ అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి
దాండియ అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి