Song: Soundarya Lahari
సౌందర్య లహరి సౌందర్య లహరి
సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి స్వర్ణ మంజరి రావే రసమాధురి వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తలే ఈ బ్రహ్మచారి కల నుంచి ఇలా చేరి కనిపించు ఓసారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు అదిరేటి ఆధరాలు హరివిల్లులు పక్కున చిందిన నవ్వులలో ఆఆ లెక్కకు అందని రతనాలు ఆఆ యతికైనా మతి పోయే ప్రతి భంగిమ ఎదలోనే పురివిప్పి ఆడింది వయ్యారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి నీలి కన్నులు నా పాళీ సంకెళ్లు నీలి కన్నులు నా పాళీ సంకెళ్లు నను చూసి వలవేసి మెలి వెయ్యగా ఊసులు చెప్పిన గుసగుసలు ఆఆ శ్వాశకు నేర్పేను సరిగమలు ఆఆ కలగంటి తెలుగింటి కళాకాంటిని కొలువుంటే చాలంట నా కంట సుకుమారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి