Pelli Sandadi Song: Chemma Chekka

  Song:  Chemma Chekka



బ్రా పదమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముది దీపికా ఆ దుగ్ధంబో నిధి జనిత లలిత సౌందర్యా ముగ్ద శ్రీ నాయికా చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులె పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు రామచిలుక ముక్కుపుడక రమనిపాప ఓ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా తారాలెన్ని ఉన్న ఈ తళుకే నిజం చలనచిత్రమేమో నీ చక్కని చక్కర శిల్పం మనసు తెలుసుకుంటే అది మంత్రాలయం కనులు కలుపుకుంటే అది కౌగిలికందని ప్రణయం ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి పరువానికి పరువైన యువతీ వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి మనసిచ్చిన మరుమల్లెకు మరిది దొరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం పెదవిచాటు కవిత మన ప్రేమాయణం వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పించం అందమారబెట్టే అద్దాల చీరకట్టే తడి ఆరిన బిడియల తరుణి మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టే మగసిరిగాలా దొరతనమెవరిదనీ బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులె పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు రామచిలుక ముక్కుపుడక రమనిపాప ఓ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ