Oka Chinna Mata Movie Song Oka Chinna Mata
ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదె
కనుచూపులు కలిసే వేళా
నా మాటలు కొంచెం వినవె
వరమిచ్చినా దేవుని చూసే
సుముహుర్తమోస్తున్న వేళా
నీకెందుకే ఈ తొందరా
ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదె
కనుచూపులు కలిసే వేళా
నా మాటలు కొంచెం వినవె
చిరునవ్వుల దేవిని చూసే
సుముహుర్తమోస్తున్న వేళా
నీకెందుకే ఈ తొందరా
చెప్పవమ్మా చెప్పు ఒక్క చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక్క చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
తాజా గులాబీకన్నా
మురిపించు మల్లెలకన్నా
మెరిసే తార కన్నా
తన తలపే నాకు మిన్న
ఓహ్ వేదాల ఘోష కన్నా
చిరుగాలి పాట కన్నా
ప్రియమార నన్ను తలచే
తన మనసే నాకు మిన్న
మొహం తొలిమొహం
కనుగీటుతున్న వేళా
రాగం అనురాగం
ఎద పొంగుతున్న వేళా
చెప్పాలి ఒక చిన్న మాట
చెప్పవమ్మా చెప్పు ఒక్క చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక్క చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
నాలోని ఆశ తానై
తనలోని శ్వాస నేనై
ప్రవలించు రాగమేదో
పలికింది క్షణాన నాలో
ఓహ్ నాకంటి పాప తానై
తన కొంటె చూపు నేనై
ఆడేటి ఊసులన్నీ
మిగిలాయి క్షణాన నాలో
గాలి చిరుగాలి
కబురైనా చేర్చలేవా
చెలిని నిచ్చెలిని
ఒక మారు చూపలేవా
విరహాన వీచే క్షణానా
చెప్పవయ్యా చెప్పు ఒక్క చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక్క చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
ఓ మానస తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదె
కనుచూపులు కలిసే వేళా
నా మాటలు కొంచెం వినవె
చిరునవ్వుల దేవిని చూసే
సుముహుర్తమోస్తున్న వేళా నీకెందుకే ఈ తొందరా