Ninne Pelladatha Movie Song Ninne Pelladesthanantu
బాబాంబాం బాబాంబాం బాబాంబాం బాబాంబాం
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సరేరా కుమార అలాగే కానీరా
మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా
సెలక్షన్ చూసాం శభాష్ అంటున్నాం
హహ ముహూర్తం చూస్తాం తధాస్తు అనేసి మూడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమై పోతాం లేరా
సరేరా కుమారా అలాగే కానీరా
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం
ప్రేమదాకా ఓకే పెళ్లి మాత్రం షాకె
చాలురా నారదా నీ హరికథ
పెళ్లఏ యోగమే నీకున్నాదా
ఇంటిలో ఇందరం ఉన్నాం కదా
కోరితే సాయమే చేస్తాం కదా
పార్కులో సీన్ తప్పురా శ్రీనూ
అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి
ముద్దాడుకుంటారా కుర్రాళ్ళు
ఈ మహాలక్ష్మి ఇంటికి వస్తే
మేము మాత్రం కాదంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఉరుకుంటామా
సిగ్గు పడవే పండు
నువ్వు కాదురా ఫ్రెండు
ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం
అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం
విందులు మెక్కుతూ వంకలు పెడతాం
చీటికీ మాటికీ చెలరేగుతాం
అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
పెళ్లి కాగానే అందరిని తరిమేసి
మిమ్మల్ని గదిలోకి నెట్టేసి
ఖర్చెంతయిందో లెక్కలు వేస్తూ
మేలుకొంటాం మీకు పోటీగా
లాలల్ల లాలల్ల లాలల్ల లాలల్ల
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సెలక్షన్ చూసాం శభాష్ అంటున్నాం
హహ ముహూర్తం చూస్తాం తధాస్తు అనేసి మూడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమై పోతాం లేరా
బాబాంబాం బాబాంబాం బాబాంబాం బాబాంబాం
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఉరుకుంటామా