SONG
Neti Siddhartha Movie song Girilo lahiri
గిరిలో లాహిరి గిరికోన పందిరి గుడిలో దేవత వన దుర్గ వాసిరి జతగా జాననే మనువాడే సందడి ఒకసారే వచ్చెను పల్లకి ఒడి చేరే వయ్యారి జంటకి గిరిలో లాహిరి గిరికోన పందిరి గుడిలో దేవత వన దుర్గ వాసిరి జతగా జాననే మనువాడే సందడి ఒకసారే వచ్చెను పల్లకి ఒడి చేరే వయ్యారి జంటకి పడుచుల పాటలే పనసల తేనెలై నడుమున ఊగినా గమకపు వీణలై మగసిరి నవ్వులే గుడిసేపు దివ్వెలై చిచ్చర చిందుకీ సిరిసిరి మువ్వలై ఈ కోనల్లో ఇంద్రధనస్సులు ఈ కోనల్లో ఇంద్రధనస్సులు కడకొంగులు దాటినా ఈ కన్నె సొగసులు చాలిస్తే మేలు కదా సందె వరసలు గిరిలో లాహిరి గిరికోన పందిరి గుడిలో దేవత వన దుర్గ వాసిరి జతగా జాననే మనువాడే సందడి ఒకసారి వచ్చెను పల్లకి ఒడి చేరే వయ్యారి జంటకి కలిసిన కన్నులే కౌగిట వెన్నెలై వగలను పొంగినా పరువపు జున్నులై మనువులు మల్లెలే మాపటి అసలై వదిలిన మత్తులో అలిగిన ఊసులై మా గుండెల్లో సూర్యచంద్రులు మా గుండెల్లో సూర్యచంద్రులు మా కంటికి రెప్పలు ఈ మంచి మనసులు మీరేగా వాల్మీకి శబరి గురుతులు హే గిరిలో లాహిరి గిరికోన పందిరి గుడిలో దేవత వన దుర్గ వాసిరి జతగా జాననే మనువాడే సందడి ఒకసారి వచ్చెను పల్లకి ఒడి చేరే వయ్యారి జంటకి గిరిలో లాహిరి గిరికోన పందిరి గుడిలో దేవత వన దుర్గ వాసిరి జతగా జాననే మనువాడే సందడి ఒకసారి వచ్చెను పల్లకి ఒడి చేరే వయ్యారి జంటకి