Nenu Meeku Telusa Movie Song Emaindo Gaani Chusthu
ఏమైందో గాని చూస్తూ చూస్తూ చేయిజారి వెళ్ళిపోతోంది మనసిలా ఏం మాయ వల వేస్తూ చూస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా అదుపులో వుండదే చెలరేగే చిలిపితనం అటు ఇటూ చూడదే గాలిలో తేలిపోవడం అనుమతి కోరదే పడి లేచే పెంకితనం అడిగిన చెప్పదే ఏమిటో అంత అవసరం ఏం చెయ్యడం మితి మీరే ఆరాటం తరుముతూ ఉంది ఎందుకిలా ఏమైందో గాని చూస్తూ చూస్తూ చేయిజారి వెళ్ళిపోతోంది మనసిలా తప్పో ఏమో అంటుంది తప్పదు ఏమో అంటుంది తడబాటు చేరని నడకా కోరే తీరం ముందుంది చేరాలంటే చేరాలి కదా బెదురుతూ నిలబడకా సంకేళ్లుగా సందేహం బిగిసాకా ప్రయాణం కదలదుగా కలలాగా అలాగే మది ఉయ్యాల ఊపే భావం ఏమిటో పోల్చుకోవే త్వరగా లోలో ఎదో నిప్పుంది దాంతో ఎదో ఇబ్బంది పడతావటే తొలి వయసా ఇన్నాళ్లుగా చెప్పంది నీతో ఎదో చెప్పింది కదా అని తెలియదా మనసా చన్నీళ్లతో చల్లారని కాస్త ఇలా సంద్రంలో రగిలే జ్వాలా ఎదో గంట ముద్దు తనకందిస్తే చాలు అంతే అందిగా అంతేగా తెలుసా ఏం మాయ వల వేస్తూ చూస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా అదుపులో వుండదే చెలరేగే చిలిపితనం అటు ఇటూ చూడదే గాలిలో తేలిపోవడం అనుమతి కోరదే పడి లేచే పెంకితనం అడిగిన చెప్పదే ఏమిటో అంత అవసరం ఏమైందో గాని చూస్తూ చూస్తూ చేయిజారి వెళ్ళిపోతోంది మనసిలా