SONG
Nari Nari Naduma Murari movie song Yem Vano
ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది చాటు మాటు దాటి అవి ఇవి చుసేస్తోందీ ఏం వానో ఉరుకుతున్నది ఇది ఏం గోలో ఉరుముతున్నది ఆట పాట చూపి అటు ఇటు లాగేస్తోంది ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసింది ఉలికి పడి తలపేదో కళల గడి తీసింది వానమ్మా వాటేస్తుంటే మేనంతా మీటేస్తుంటే ఇన్నాళ్లు ఆ ఓరగా దాగిన వయ్యారం హోరున పాడెను శృంగారం ఏ గాలి కొట్టిందో నే దారి పట్టింది ఏం వానో ఉరుకుతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది మనకు గల వరసేదో తెలిసి ఎద వలచిందో మునుపు గల ముడి ఏదో బిగిసి జత కలిసిందో ఏమైందో ఏమోనమ్మా ఏనాడో రాసుందమ్మా ఇన్నాళ్లు ఆ ముడుపున వొడిచిన బిడియాలు ఒడుపుగా ఒలిచెను చెలికాడు నా చూపు నచ్చిందో నాజూకు ఇచ్చింది ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది చాటు మాటు దాటి అవి ఇవి చుసేస్తోందీ ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది