Muddula Priyudu Song: Chitapata

- Movie: Muddula Priyudu
- Song: Chitapata
చిట పట చిట్టా పట్టా
కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తఱిగిట
తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన
చిలకల చిట్టెమ్మ చిదిమిన సిగ్గమ్మ
చినుకుల శ్రీరంగ వణుకుతూ వటేస్తా
ఎగబడి దిగబడి మగసిరి కలబడి అలిగిన
అందలిక నీవే పదమంటా
చిట పట చిట్టా పట్టా
కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తఱిఁగిట
తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన
నీ జంట జంపాల తనువులు కలబడి తపనలు ముదరగానే
నీ చుపులియ్యల పెదవుల ఎరుపులు తొలకరి చిలికేనులే
తేలి మబ్బో చెలి నవ్వో చలి జలకళతో పలికేనులే గిలిగిలిగా
హరివిల్లో కనుచూపో తడి మెరుపులతో తడిమెనులే చలి చలిగా
మెచ్చి మెలిపెడతా గీచి గిలిపెడతా పచ్చి
పడుచుల వలపుల చిలకల పిలుపుల పలుకుల
బుడి బుడి కులుకుల బుడి బుడి నడకలు వెంటాడు వేళల్లో
చిట పట చిట్టా పట్టా
కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తఱిగిట
తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన
నా మల్లె మరియాదా మడిచిన సొగసులు విడిచిన ఘడియలలో
నీ కన్నె సిరి మీద చిలకల పలుకుల అలికిడి తళుకులలో
పసి మొగ్గో కసి బుగ్గో చలి చెడుగుడులో చెరిసగమే అడిగెనులే
అది ప్రేమో మరి ఏమో యమా గిల గిలిగా సల సలాగా తొలిచేనులే
చేత చే పెడతా చెంగు ముడిపెడతా
చెంప తళుకులు కలిసిన మెరుపులు
దులిపిన ఒడుపున తడిమిన సొగసుల
తొడిమలు తొణికల అందాల వేటలో
చిట పట చిట్టా పట్టా
కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తఱిఁగిట
తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన
చిలకల చిట్టెమ్మ చిదిమిన సిగ్గమ్మ
చినుకుల శ్రీరంగ వణుకుతూ వటేస్తా
ఎగబడి దిగబడి మగసిరి కలబడి అలిగిన
అందలిక నీవే పదమంటా
చిట పట చిట్టా పట్టా
కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా
తరిగిట తఱిఁగిట
తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన