ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మా ముద్దులన్నీ పండేదెపుడమ్మా ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ మూర్తం ముందుందీ ఓ చిన్నమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది ఇది మొదలేనమ్మా ముందు కథ ఉందోయమ్మ తొలి రేయి లోన దోర వయసు వాయినాలు ఇవ్వాలమ్మా ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు మూళ్ళ మూర్తం ముందుందీ ఓ చిన్నమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది పసుపు పారాణి బొట్టు కాటుక దిద్దిన నా రాణి నాకే కానుక మమతే మంత్రముగా మనసే సాక్షిగా మాటే మనుగడగా మనమే పాటగా సాగాలి జీవితము చెప్పాలి స్వాగతము నిండు నూరేళ్ళ మనువుగా రాగాల శృంగారం గారాల సంసారం పండే వెయ్యేళ్ళు మనవిగా బుగ్గన చుక్క వచ్చెనే సిగ్గుల మొగ్గ విచ్చేనే ఈ నిగ్గే పగ్గమేసి నెగ్గేనమ్మ లగ్గమంటూ ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ మూర్తం ముందుందీ ఓ చిలకమ్మా ముత్తైదు భాగ్యాలిస్తుంది తేనెకు తీయదనం తెలిపే ముద్దులో వయసుకు వెచ్చదనం తెలిసే పొద్దులో కలలకు కమ్మదనం కలిగే రేయి లో వలపుల మూలధనం పెరిగే హాయిలో అందాల వెల్లువలో వందేళ్ల పల్లవులే పాడే పరువాలే తోడుగా వెయ్యాలి కూడికలు వెయ్యేళ్ళ వేడుకలు వేడిగా విరహాలే వీడగా గాజుల వీణ మీటగా జాజుల వాన చాటుగా ఈ కొంగు కొంగు కూడి రంగ రంగ వైభవం గ ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ మూర్తం ముందుందీ ఓ చిన్నమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మా ముద్దులన్నీ పండేదెపుడెమ్మ