Mirai Movie Song: Jaithraya
ధర్మం జైత్రాయ
ధైర్యం జైత్రాయ
సర్వం జైత్రాయ
కార్య సిద్ధికై తేగించు పోరులో
గ్రహాలు శుభమని అనుగ్రహించవా
మాతృ సేవకై తపించు త్రోవలో
జగాలు జయమని ఆశీర్వదించవా
ధర్మం జైత్రాయ
ధైర్యం జైత్రాయ
సర్వం జైత్రాయ
కార్య సిద్ధికై తేగించు పోరులో
గ్రహాలు శుభమని అనుగ్రహించవా
మాతృ సేవకై తపించు త్రోవలో
జగాలు జయమని ఆశీర్వదించవా
అగ్ని కీలలే దిక్సూచి అవ్వగా
మేఘాల జ్యోతులే దీవించి పంపగా
నిశబ్ద శబ్దమే సంకేతమివ్వగా
నక్షత్ర మాలాలే లక్ష్యాన్ని చూపవా
ప్రతి కణం నీ మాతృ భిక్ష
ప్రతి క్షణం ఆ ప్రేమ రక్ష
జ్వలించగా నీ జీవితేచ్ఛ
ఫలించదా నీ దీక్ష