మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మల్లి చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిసే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి పాతికేళ్ల పెనిమిటైన పాపాయిల చూసుకున్న కాలు జారుతుందో ఏమో అని కల్లాల్లోనే దాచుకున్న కన్నా బిడ్డ కన్నా మొగుడి మీదనే నా బెంగ ఎల్లప్పుడూ పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేనె ఇప్పుడు ఏనాడైనా ఒక్క మాటైనా అనలేదమ్మా వెర్రి నాయన అటువంటి మహారాజుకి తగు జంట అవుతానని త్వరలోనే నా ఉసుని మరపింప చేస్తానని మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మల్లి దీపాన్ని పెట్టమ్మా వెళ్లి ముతైదువుగా పైకి వెళ్లే భాగ్యాన్ని పొందాను గనక వస్తాను త్వరలోనే మల్లి ఆ పుణ్యమే తోడు రాగ ఏమి చేసిన కన్నా తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమ ఎంత పొందిన తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మ ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై వచ్చేది నేనేనని గుర్తుంచుకుంటానని ఆ కొత్త జన్మానికి నా పేరే పెడతానని మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిసే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి