Matrudevobhava Movie Song Raalipoye Puvva
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడు లే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెల్లవారని రెయమ్మ
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడు లే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
చెదిరింది నీ గూడు గాలిగా
చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగ
సింధుర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై
ఆశలకే హారతివై
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడు లే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై
జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై
తీగ తెగే వీణియవై
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడు లే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే