Mahatma Movie Song konthamandhi sontha peru
రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీత రామ్ ఈశ్వర అల్లాహ్ తేరో నామ్ సబ్ కో సమ్మతి దే భగవాన్ కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ కరెన్సీ నోట్ మీద ఇలా నడి రోడ్ మీద మనం చూస్తున్న బొమ్మ కాదు ర గాంధీ భరత మాత తల రాతను మార్చిన విధాత ర గాంధీ తర తరాల యమా యాతన తీర్చిన వరదాత ర గాంధీ కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆ చరిత కర్మ యోగమే జన్మంతా ధర్మ క్షేత్రమే బ్రతుకంతా సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీత ఈ బోసి నోటి తాతా మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి సత్య అహింసల మార్గజ్యోతి నవ శకానికి నాంది రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీత రామ్ ఈశ్వర అల్లాహ్ తేరో నామ్ సబ్ కో సమ్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీత రామ్ ఈశ్వర అల్లాహ్ తేరో నామ్ సబ్ కో సమ్మతి దే భగవాన్ గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెన గ చేసి దండి యాత్రని దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగ్గజేత చరకా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగులా బందించాడురా జాతిపిత సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపించిన క్రాంతి తూరుపు తేలారని నడిరాత్రికి స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావన మూర్తి హృదయలేలిన చక్రవర్తి ఇలాంటి నరుడొక డిలాతరం పై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి సర్వ జన హితం న మతం అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే న ఆయువంతా అంకితం హే రామ్