- Movie: Kshana Kshanam
- Cast: Sridevi,Venkatesh
- Music Director: M M Keeravani
- Year: 1991
- Label: Aditya Music
Song:
అందనంత ఎత్త తార తీరం
సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంతా కొత్త తాళం తీస్తే
సందె విందు సొంతం కాదా
అందనంత ఎత్త తార తీరం
సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంతా కొత్త తాళం తీస్తే
సందె విందు సొంతం కాదా
చిందే సరదా పొంగే వరదా
స్వర్గం మన సమీపమయ్యేంత
అందనంత ఎత్త తార తీరం
సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంతా కొత్త తాళం తీస్తే
సందె విందు సొంతం కాదా
అందనంత ఎత్త తార తీరం
సంగతేంటో చూద్దాం దా
గువ్వ నీడలో గూడు కట్టుకో
కుర్ర వేడిలో కుకూ కూతపెట్టుకో
దిక్కులన్నీ తెగించే వేగంతో
రెక్క విప్పు నిశాలెన్నో
గుప్పెడంత కులాసా గుండెల్లో
గుప్పుమన్న ఖుషిలెన్నో
తోటమాలి చూడకుండా
ఏటవాలు పాటమెంత
మొగ్గ నవ్వు చేరుకుంటే
చుక్కలింట పండగంట
అందనంత ఎత్త తార తీరం
సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంతా కొత్త తాళం తీస్తే
సందె విందు సొంతం కాదా
అందనంత ఎత్త తార తీరం
సంగతేంటో చూద్దాం దా
కొంటె కోనలో కోట కట్టుకో
కొత్త కోకలో కోకో కోరికందుకో
కోల కళ్ళ గులాబీ గుమ్మల్లో
కాచుకున్న కబురులెన్నో
కమ్ముకున్న కిలాడి కొమ్మల్లో
గుచ్చుకున్న గుణాలెన్నో
లాగుతున్న గాలివెంట
సాకుతున్న పూలమంట
తాకుతుంటే దాగదంట
ఆకాశాన పాలపుంత
అందనంత ఎత్త తార తీరం
సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంతా కొత్త తాళం తీస్తే
సందె విందు సొంతం కాదా
అందనంత ఎత్త తార తీరం
సంగతేంటో చూద్దాం దా