Gulabi Song: Ye Rojaithe Chusano
ఏ రోజైతే చూశానో నిన్నూ
ఆ రోజే నువ్వైపోయా నేను
ఏ రోజైతే చూశానో నిన్నూ
ఆ రోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినేనై జీవిస్తున్నానూ
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో
నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నను నడిపిస్తూ ఉంటే
నీ నీడై వస్తా ఎటు వైపున్నా
నీ కష్టం లో నేనూ ఉన్నానూ
కరిగే నీ కన్నీరవుత నేనూ
చెంపల్లో జారీ నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతం లో ఓదార్పవుతాను
కాలం ఏదో గాయం చేసిందీ
నిన్నే మాయం చేశానంటోందీ
లోకం నమ్మి అయ్యో అంటోందీ
శోకం కమ్మి జోకొడతానందీ
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ
నాలో పొంగిన గుండెల సవ్వడులే
అవి చెరిగాయి అంటే నే నమ్మేదెట్టాగా
నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా
నీ కష్టం లో నేనూ ఉన్నానూ
కరిగే నీ కన్నీరవుత నేనూ
చెంపల్లో జారీ నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ
ఏ రోజైతే చూశానో నిన్నూ
ఆ రోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినేనై జీవిస్తున్నానూ