- Movie: Gayam
- Cast: Jagapati Babu,Revathi,Urmila Matondkar
- Music Director: Sri Kommineni
- Year: 1993
- Label: Aditya Music
Song: Suraajyamavaleni Swaraajyamendukani
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకని
నిజాన్ని బలి కోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భారత పతాకం
ఆవేశంలో ప్రతినిముషం ఊరికే నిప్పుల జలపాతం
కత్తికోనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగారు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలే ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచేనదిగో ఎగిరే భారత పతాకం
చెరుగుతుంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభావం
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకని
కులమతాల దావానలానికి కరుగుతున్నది మంచుశిఖరం
కలహముల హాలా హలానికి మరుగుతున్నది హిందూసంద్రం
దేశమంటే మట్టికాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువునా ఈ వికృత గాయం