Eshwar Movie Song Innallu

 Eshwar Movie Song Innallu


ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి వున్నానని ఇన్నాళ్లు చెంతనున్న ఈనాడే చెప్పుకున్న నీ కోసం బతికి వున్నానని కొలువుండిపో ప్రాణమై ఇలా ఎదనిండిపో అనురాగమా ఇన్నాళ్లు చెంతనున్న ఈనాడే చెప్పుకున్నా నీ కోసం బతికి వున్నానని స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దని చూపుతో చెప్పని రెప్ప వెయ్యొద్దని ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అన్ని మబ్బుల్లో జాబిల్లిని గుప్పిట్లో పొందాలని నమ్మాలి అనిపించని ఊహల్లో నన్నుండని ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి వున్నానని నేననే మాటనే మరచిపోయానని నిన్నిలా అల్లుటూ కొత్తగా పుట్టని ఇప్పుడీ జన్మకి నీ పేరునే పెట్టని నిట్టురుపులన్నింటిని నిన్నల్లో వదిలెయ్యని రానున్న వెయ్యేళ్ళని ఈ పూట ఉదయించని ఇన్నాళ్లు చెంతనున్న ఈనాడే చెప్పుకున్నా నీ కోసం బతికి వున్నానని ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి వున్నానని కొలువుండిపో ప్రాణమై ఇలా యదానిండిపో అనురాగమా ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి వున్నానని