Dharma Chakram Movie Song Dheera Sammere
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి
ఆకాశమే నా హద్దుగా నీకోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా ఇచ్చేయి మెచ్చిన సొగసులు
ధీర సమీరే యమునా తీరే వసతివనె వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి
వేసంగి మల్లెల్లో శీతంగి వెనెల్లో వేసారి పోతున్నారా రా రా
హేమంత మంచులో ఏకాంత మంచంలో వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో తిరగబడి మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో మదనుడికి పొగరు పెరిగే పొదలో
గోరింట పొద్దులోనా పేరాంటాలే ఆడే వేళా
ధీర సమీరే యమునా తీరే వలచితి వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియా తగునా రాసకేళి
లేలేత నీ అందం నా గీత గోవిందం
నా రాధా నీవే లేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్న రావా
వయసు తెలిసే ఒడిలో యదా కరిగి తపన పెరుగు తడిలో
మానవు కుదిరే మదిలో ఇంకెప్పుడు చనువు ముదురు గదిలో
వాలారు సందల్లోనా వయ్యారాలే దాటే వేళా
ధీర సమీరే యమునా తీరే వలచితి వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియా తగునా రాసకేళి
ఆకాశమే నా హద్దుగా నీకోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా ఇచ్చేయి మెచ్చిన సొగసులు
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి