ankusam movie song Idi Cheragani Premaku

 

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం

ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు పారాణి మిసమిసలు పదములకు తెలుసు పడటింటి గుసగుసలు పానుపుకి తెలుసు చిగురుటాసలా చిలిపి చేతలు పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్లకందం శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం నింగికి పున్నమి జాబిల్లి అందం ఇంటికి తొలిసులు ఇల్లాలు అందం జన్మ జన్మల పుణ్యఫలముగా జాలువారు పసిపాప నవ్వులే ఆలుమగలకు అందం ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు