Allari Priyudu Movie Song Pranayamaa

  

  •  Movie:  Allari Priyudu
  •  Cast:  Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna
  •  Music Director:  M M Keeravani
  •  Year:  1993
  •  Label:  Aditya Music

  • Song :     Pranayamaa

ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా ప్రేమ కవితా గాణమా నా ప్రాణమున్నది శృతి లేక గేయమే యదా గాయమైనది వలపు చితిని రగిలించగా తీగ చాటున రాగమా ఈ దేహమున్నది జతలేక దాహమారని స్నేహమై యధా శిధిల శిశిరమై మారగా ఓ హృదయమా ఇది సాధ్యమా రెండుగా గుండె చీలునా ఇంకా ఎందుకు శోధనా రెండుగా గుండె చీలునా ఇంకా ఎందుకు శోధనా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా ప్రేమ సాగర మధనమే జరిగింది గుండెలో ఈ వేళా రాగమన్నది త్యాగమైనది చివరికెవరికి అమృతం తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ అశ్రుధారలే అక్షరాలుగా అనువదించే నా జీవితం ఓ ప్రాణమా ఇది న్యాయమా రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం సూన్యమా రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం సూన్యమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా